A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
Share |
August 11 2020, 11:36 am

గత ప్రభుత్వంలో గుంటూరు జిల్లా ఐనవోలు అనే గ్రామంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని కొద్ది సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినప్పుడే దళిత వర్గాలకు అనుమానం వచ్చిందని వైసిపి ఎమ్మెల్యే పిజెఆర్ సుధాకర్ బాబు అన్నారు. అప్పట్లో కాల్ సెక్స్ మనీ సమస్యను దారి మళ్లించడానికి 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారన్న సంగతి తర్వాత అర్దం అయిందని ఆయన అన్నారు. రాజదానిలో పేదలైన ఎస్సి బిసి వర్గాలకు స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తే, అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని , వారికి స్థలాలు ఇవ్వడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు కోర్టులో వాదించారని ఆయన అన్నారు. అదే భావనతో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించలేదని ఆయన అన్నారు. ఇప్పుడు దళితుల ఆత్మగౌరవం నిలబడేలా విజయవాడ నగరం మద్యలో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారని అన్నారు.దీనిని కూడా చంద్రబాబు తాబేదార్లు మళ్లీ వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, శ్రావణ కుమార్ లు ఐనవోలు వెళ్లి వచ్చారని , అది ఎక్కడ ఉందంటే ప్రదాని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి , ఐనవోలుకు ఎంత దూరం ఉందో వారు తెలుసుకోవాలని సుధాకర్ అన్నారు.టిడిపి ఎన్ని కుయుక్తులు చేసినా , జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి తీరుతారని ఆయన అన్నారు.

tags : sudhakar babu

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info