A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
Share |
August 13 2020, 11:00 am

కాంగ్రెస్ ,బిజెపి నేతలపై మంత్రి శ్రీనివాస గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి నాలుక చీలుస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా నేతల తరహాలో మాట్లాడుతున్నారని, సెక్షన్‌ 8పై వారు చేసిన వ్యాఖ్యల ద్వారా నిజ స్వరూపం బట్టబయలైందని శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్తిత్వంపై రాజీ పడేది లేదని, ఎవరైనా సెక్షన్‌ 8 గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఇతరుల పెత్తనం సహించేది లేదని, బానిస తెలంగాణను అనుమతించేది లేదన్నారు. పరాయి మనస్తత్వ బానిస నేతలపై ప్రాణాలకు తెగించి పోరాడతామని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఏనాడూ తెలంగాణ కోసం పోరాడలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే తెలంగాణ ఏడు మండలాలను కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.సచివాలయంపై కోర్టు తీర్పుకోసం ఏడాది పాటు ఎదురుచూశామని, సచివాలయ నిర్మాణం వద్దనే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

tags : srinivas goud

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info