A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లాక్ డౌన్ ..కరోనా..కెటిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Share |
August 15 2020, 1:50 am

తెలంగాణ మంత్రి కెటిఆర్ కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాతో ఎందరు చనిపోతారో తెలియదు కాని, ఆర్దిక ఇబ్బందులతో ఎందరు ఉద్యోగాలు కోల్పోతారో తెలియని పరిస్థితి ఉందని కెటిఆర్ అన్నారు.ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం లేదని ఆయన అన్నారు.కరోనా వాక్సిన్ వచ్చే వరకు మొత్తం లాక్ డౌన్ చేసి ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.ఇంకా లాక్ డౌన్ కొనసాగిస్తే ప్రజలు ఉపాది కోల్పోతారని కెటిఆర్ అన్నారు. ప్రజలకు జీవితం,జీవనోపాది ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.కరోనా సహజీవనం చేస్తూనే ఉపాది, అబివృద్ది సాధించాలని ఆయన స్పష్టం చేశారు.కేవలం ప్రభుత్వమే అన్నీ చేయజాలదని,ప్రజలు కూడా భాద్యతగా ఉండాల్సిన తరుణమిదని ఆయన అన్నారు. కరోనా మరణాలను ఎవరైనా దాచగలరా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు తక్కువేనని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు కరోనాను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

tags : ktr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info