A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాది జవాబుదారి ప్రభుత్వం- జగన్
Share |
August 15 2020, 1:02 am

గత టిడిపి ప్రభుత్వం రైతుల రుణాల వడ్డీల కింద చెల్లించవలసిన మొత్తాన్ని బకాయి పెడితే, దానిని తాము చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.,రైతు దినోత్సవవం లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రైతులు సకాలంలో చెల్లించిన రుణాలకు ప్రభుత్వం కట్టవలసిన వడ్డీలను తూతూ మంత్రంగా చేశారని ,ఇప్పుడు సున్నా వడ్డీ స్కీమ్ కింద రైతులకు పూర్తిగా చెల్లిస్తున్నామని ,ఇప్పుడు బకాయిలు ఉండవని, ఇది జవాబుదారితనం అని ఆయన అన్నారు.దీనివల్ల ఏభై ఏడు లక్షల రైతులకు మేలు చేస్తున్నామని ఆయన అన్నారు. సున్నా వడ్డీ కింద ఇవ్వవలసిన వడ్డీలను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి జమ చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పుడు 1150 కోట్ల నిధులను రైతులు ఇస్తున్నామని జగన్ తెలిపారు.భవిష్యత్తులో కూడా రైతులకు సున్నా వడ్డీ రుణాలను అమలు చేసి,వారు సకాలంలో చెల్లిస్తే,వారి ఖాతాలలోకి డబ్బు జమ చేసే బాద్యత తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

tags : jagan,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info