A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జార్కండ్ ముఖ్యమంత్రి హోం క్వారంటైన్
Share |
August 15 2020, 1:05 am

జార్కండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ హోం క్వారంటైన్ కు వెళ్లవలసి వచ్చింది. ఆయనను కలిసిన ఒక మంత్రికి, మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ముఖ్యమంత్రి స్వీయ గృహ నిర్భందంలోకి వెళ్లారని వార్త వచ్చింది.మంత్రి మిదిలేష్, ఎమ్మెల్యే మధుర మహతో లు కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ముందుజాగ్రత్త చర్యగా తాను బుధవారం నుంచి కొన్నిరోజులు స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేశారు.తన కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ హోం క్వారంటైన్‌కు వెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యమైన పనులను తాను ఇంటినుంచే నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావడం మానుకోవాలని, అత్యవసరమైతే మాస్క్‌లు ధరించే బయటకు రావాలని కోరారు. సీఎం సోరెన్‌ నివాసానికి వెళ్లే మార్గాలను అధికారులు మూసివేశారు.

tags : hemanth soren

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info