A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో జిల్లాల విభజన- ధర్మాన అభ్యంతరం
Share |
August 15 2020, 1:07 am

ఎపిలో పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను విడదీస్తే సమస్యలు వస్తాయా? కొన్ని చోట్ల కొందరు నేతలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాతిపదికను వ్యతిరేకిస్తున్నారు. వైసిపి ఎమ్మెల్యే ,మాజీ మంత్రి దర్మాన ప్రసాదరావు జిల్లాలు పెంచడాన్ని స్వాగతిస్తూనే, పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన శ్రీకాకుళం జిల్లాను విడదీయవద్దని సూచించారని వార్త వచ్చింది.జిల్లాల విభజన ముందు తమ అభిప్రాయం తీసుకోవాలని ఆయన సూచించారు.జిల్లా విభజనపై ప్రజలలో ఆవేదన ఉందని ఆయన అన్నారు. రాజకీయంగా కూడా ఇబ్బంది ఉంటుందని ఆయన అబిప్రాయపడ్డారు. కాగా చిత్తూరు జిల్లా మదనపల్లె, రాజంపేట మద్య కూడా అదే తరహా సమస్య వచ్చేలా ఉంది. ఆ రెండు పట్టణాలు దూరంగా ఉండడం వల్ల రాజంపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే మదనపల్లె వాసులు సమస్యలకు గురి అవుతారని కొందరు నేతలు చెబుతున్నారు. ఈ లెక్కన తెలంగాణలో మాదిరి వెసులుబాటును బట్టి జిల్లాలలను ఏర్పాటు చేసుకుంటే బెటర్ అనుకోవాలేమో!

tags : dharmana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info