A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అచ్చెన్నాయుడు పై తీర్పు-కొత్త సమస్య అవుతుందా
Share |
August 15 2020, 1:53 am

ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా ఉంది.టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడుకు ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అచ్చెన్నాయుడును ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంతా బాగానే ఉందని చెప్పి డిశ్చార్జ్ చేశారు.కాని కొన్ని రోజుల తర్వాత ఆయనను ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చవచ్చన్న తీర్పు పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ఇకపై ఎవరైనా నిందితుడు జైలులో ఉండకుండా తప్పించుకోవడానికి ఈ తీర్పును ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని కొందరు లాయర్లు అబిప్రాయపడుతున్నారు.దీనిని ప్రభుత్వం అప్పీల్ చేస్తుందా ?లేదా అన్నది చూడాలని అంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వీలుగా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని తప్పు పట్టనక్కర్లేదని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం ఇది స్కామ్ లు చేసి, లేదా పెద్ద నేరాలు చేసి ఎవరైనా తమకు ఆరోగ్య సమస్య ఉందని చెప్పి ప్రైవేటు ఆస్పత్రులలో చేరితే అది కొత్త సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. డబ్బు ఉంటే నిందితులు ఏ ఆస్పత్రిలో అయినా చేరవచ్చని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

tags : acchennaidu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info