A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శానిటరీ సిబ్బందికి పిపిఈ కిట్స్ ఇచ్చారు
Share |
August 13 2020, 11:12 am

*శానిటేష‌న్, ఎంట‌మాల‌జి సిబ్బందికి పి.పి.ఇ సేఫ్టీ కిట్స్ పంపిణీ చేసిన మంత్రి కె.టి.ఆర్‌*
*పాల్గొన్న న‌గ‌ర‌ మేయర్ బొంతు రామ్మోహన్, మూసి రివర్ డెవలప్మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి
సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, కార్పొరేట‌ర్ సంగీత‌, కమీషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్*
*హైద‌రాబాద్‌, జూలై 06:*  కోవిడ్ -19 నియంత్రణలో జి హెచ్ ఎం సి  లోని శానిటేషన్, ఎంటమాలజీ,  డి.ఆర్.ఎఫ్ సిబ్బంది
చేస్తున్న కృషిని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అభినందించారు. సోమవారం ఫతుల్లాగూడ లోని యానిమల్ కేర్
సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బంది కి  "పి.పి.ఇ సేఫ్టీ కిట్స్ "పంపిణీ చేశారు. ప్రస్తుతం  రూ. 13
కోట్ల వ్యయంతో 22 వేల మంది శానిటేషన్, 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి పి.పి.ఇ సేఫ్టీ కిట్స్ కిట్స్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కిట్స్ ను రెగ్యులర్ గా వినియోగించాలని సిబ్బందికి మంత్రి కె టీ ఆర్ సూచించారు.  కోవిడ్ -19 వ్యాప్తిని అరిక‌ట్టుట‌లో శానిటేష‌న్‌,
ఎంట‌మాల‌జి సిబ్బంది సేవ‌ల‌ను గుర్తించి ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం, ర‌క్ష‌ణ‌తో పాటు కుటుంబ
స‌భ్యులు ఆరోగ్యాన్ని కాపాడుట‌కు ఇంటి వ‌ద్ద కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపారు. గతంలో అత్యవసరంగా 1, 80, 000
మాస్కులు, 27 వేల హ్యాండ్ గ్లోవ్స్, 25 వేల లీటర్లు హ్యాండ్ శానిటైజర్ ను శానిటేషన్, ఎంట‌మాలజీ సిబ్బందికి సర్కిళ్ల వారిగా పంపిణీ
చేసిన‌ట్లు జి హెచ్ ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ మంత్రికి వివ‌రించారు.  మూడు వారాల్లో అందరికి పి.పి.ఇ సేఫ్టీ కిట్స్
పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా యానిమల్ కేర్ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌ను మంత్రి
ప‌రిశీలించారు. అదేవిధంగా ఎంట‌మాల‌జి విభాగం ఏర్పాటు చేసిన దోమ‌ల నివార‌ణ స్టాల్‌ను సంద‌ర్శించారు. ఈ కార్యక్రమంలో జి హెచ్
ఎం సి మేయర్ బొంతు  రామ్మోహన్,  మూసి రివర్ డెవలప్మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం,
కార్పొరేట‌ర్ సంగీత‌, కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్,  ఈ వి డి ఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి,  అదనపు కమీషనర్ రాహుల్ రాజ్  జెడ్
సి ఉపేందర్ రెడ్డి, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు పాల్గొన్నారు.

tags : ktr

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info