A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో కరోనా - బాలల పరిస్తితి
Share |
August 13 2020, 11:28 am

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో బాలల స్థితి, వారి విద్యా
అవకాశాలపై జూలై ఆరో తారీఖున ఒక జూమ్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రణాళిక బోర్డు
వైస్ చైర్మన్ అయిన శ్రీ వినోద్ కుమార్ తో పాటు, వివిధ స్వచ్ఛంద సంస్థల
ప్రతినిధులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నఈ సమావేశానికి ఎం వి
ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకట్ రెడ్డి అద్యక్షత వహించారు. తన
అద్యక్షోపన్యాసంలో లాక్ డౌన్ కారణంగా పిల్లలలో బడికి వెళ్లే అలవాటు
తగ్గిపోతోందని, వారు క్రమంగా లేబర్ మార్కెట్ వైపు మళ్ళి పోతున్నారని
వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల మూసివేతతో పిల్లల
భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులలో ఆందోళన పెరిగిందని, తాము నిస్సహాయులై
పోయామని తల్లిదండ్రులు బాధపడుతున్నట్లుగా వెంకటరెడ్డి తెలియజేశారు.
ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల ప్రభావం పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ఉందని
ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు పిల్లల
కొరకు పనిచేస్తున్నాయని ఆయన తెలియజేశారు.
ఎం వి ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు వేల
మంది పిల్లల కోసం పని చేస్తున్నామని అందులో స్థానిక యువత సహకారంతో విద్యా
కేంద్రాలు నడుపుతున్నామని పిల్లలకు రకరకాల కార్యకలాపాలు అంటే పుస్తకాలు
చదవడం, ఆటలు పాటలు నిర్వహించడం, లైబ్రరీలు ఉపయోగించడం వంటి కార్యకలాపాలను
స్థానికుల సహకారంతో నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమాల
నిర్వహణకు అవసరమైన సామగ్రిని అందించడంలో గ్రామాల సర్పంచులు, పాఠశాల
విద్యా కమిటీ సభ్యులు విశేషమైన సహకారం అందిస్తున్నారని వారు తెలియజేశారు
వందేమాతరం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ పిల్లల్లో భాషా నైపుణ్యం
పెంచడానికి వారిలో క్రమబద్ధమైన ఆలోచనా విధానం నేర్పడానికి, వారికి జీవన
నైపుణ్యాలు అలరించడానికి రంగారెడ్డి జిల్లాలో యువజనుల ద్వారా రెండు వేల
మంది పిల్లల కొరకు తాము పని చేస్తున్నామని ఫౌండేషన్ ప్రతినిధులు
తెలియజేశారు. హై స్కూల్ పిల్లల కొరకు తాము చేస్తున్న పనులను టీచ్ ఇండియా
ప్రతినిధులు వివరించారు. అన్ని సంస్థల ప్రతినిధులు కూడా తమ తమ కార్యక్రమాలు
విజయవంతం కావడంలో యువజనుల పాత్ర గురించి ప్రముఖంగా పేర్కొన్నారు.
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా
సిన్హా మాట్లాడుతూ ఈ ప్రయత్నాలన్నీ పిల్లలు బాలకార్మికులుగా మారకుండా
ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు గా పరిగణించాలని అన్నారు. అంతేగాక పిల్లలలో
బడికి వెళ్లే అలవాటు తప్పి పోకుండా చూసేందుకు ఈ ప్రయత్నాలు సహకరిస్తాయని
ఆమె చెప్పారు. యూనిసెఫ్ విద్యాధికారి సుకన్య మాట్లాడుతూ ఇటువంటి
కార్యక్రమాలను పెద్దఎత్తున అమలుపరచడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను
తయారు చేయాల్సిన అవసరం గురించి వివరించారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

మెంబర్ శోభా రాణి మాట్లాడుతూ ఇటువంటి కార్యకలాపాలను జిల్లా బాలల హక్కుల
పరిరక్షణ సంస్థతో కలిసి చేపట్టాలని సూచించారు
రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి మాజీ ప్రొఫెసర్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి
మాట్లాడుతూ 5వ తరగతి వరకు పిల్లలలో పఠనాసక్తిని, అవగాహన సామర్థ్యాలను
పెంచడానికి మనమందరం దృష్టి కేంద్రీకరించాలని, ఈ దిశగా పాఠ్యపుస్తకాలు
ఏవిధంగా ఉపయోగపడతాయో ఆయన వివరించారు. మాజీ ఐఏఎస్ అధికారి జగదీశ్వర్ రావు
మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలోపని చేయడానికి అందరూ ముందుకు రావాలని మాజీ
ప్రభుత్వ అధికారులతో సహా ప్రతి ఒక్కరు కలిసిరావాలని జిల్లాలో ఉన్న ప్రతి
స్వచ్ఛంద సంస్థ ఈ దిశగా పని చేయాలని సూచించారు
శ్రీ వినోద్ కుమార్ మాట్లాడుతూ యువతపెద్ద సంఖ్యలో ఇటువంటి
కార్యక్రమాలలో పాల్గొనాలని, ఇందు కొరకు వారిలో ప్రేరణ కలిగించాలని ఆయన
పిలుపునిచ్చారు. గ్రామాలలో బాలల విద్యా కేంద్రాల్లో స్వచ్ఛందంగా
పనిచేస్తున్న యువతీ యువకులు పిల్లలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ వారికి
చదువులలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా అనేక రకాలుగా సేవ చేస్తున్నందుకు
వారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు
పాఠ్యపుస్తకాలు, కథల పుస్తకాలు, స్టేషనరీ కావాల్సి ఉన్నందున తాను
ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వాటిని పాఠశాల విద్యా కమిటీ లకు అందజేసేల
చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలను
పెద్దఎత్తున నిర్వహించడం ద్వారా పిల్లలు తమ విలువైన కాలాన్ని దుర్వినియోగం
చేయకుండా నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యకలాపాలు
నిర్వహిస్తున్న పౌరసమాజం సంఘాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని; యువత,
గ్రామ పంచాయతీలు, పాఠశాల విద్యా కమిటీలు ఇటువంటి మంచి ప్రయత్నాల్లో పాలు
పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లలను సమూహాలలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అన్నీ
జాగ్రతలు పాటిస్తూ అనగా మాస్క్ లు, కూర్చునే ప్రాంతం సానిటీజే చేయడం, దూరంగా కూర్చోబెట్టడం లాంటి తగు జాగ్రతలు
తీసుకోవాలని సూచించారు.
ఇటువంటి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వీలుగా బాలల హక్కుల
పరిరక్షణ కొరకు పౌరుల సంఘం పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేయాలని సమావేశం
చివరలో నిర్ణయం చేయడం జరిగింది.

tags : vinod

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info