A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముఖ్యమంత్రి ఆఫీస్ మెడక్ బంగారం స్మగ్లింగ్ కేసు
Share |
August 13 2020, 11:51 am

ఎపి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయం మెడకు తగులుకుంది.దాంతో ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ తన కార్యాలయంలోని ప్రిన్సిపల్‌ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. డిప్లమాటిక్ చానల్స్ ద్వారా బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం దుబాయ్‌ నుంచి చార్టర్డ్‌ విమానంలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ యూఏఈ కాన్సులేట్‌ అధికారి స్వప్న సురేష్‌ ఆరోపణలు రాగా ,ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నారు.కాగా ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. సిబిఐ విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కార్యాలయం నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితల ఆరోపించారు. రాయబార ఆఫీస్ పేరుతో మామూలు వస్తువుల పేరుతో బంగారాన్ని స్మగుల్ చేస్తున్నట్లు గా కస్టమ్స్ అదికారులు కనుగొన్నారు.గత ఏడాది కాలంగా ఇది సాగుతోందని చెబుతున్నారు.తాజాగా పట్టుబడిన బంగారం విలువ పదిహేను కోట్ల వరకు ఉంటుంది.

tags : kerala cm gold

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info