A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇళ్ల స్థలాలు- చంద్రబాబు సైంధవ పాత్ర
Share |
August 13 2020, 11:52 am

టీడీపీ అధినేత చంద్రబాబు పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ కాకుండా సైంధవ పాత్ర అని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు విమర్శించారు. పేద ప్రజల ఇళ్ల పట్టాలు పంపిణీని టీడీపీ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం 60 వేల ఎకరాలు సిద్దం చేశామని తెలిపారు. మొత్తం 30 లక్షల మంది పేద కుటుంబాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారన్న పద్దతిలో చంద్రబాబు, ఆయన మనుషులు ఈ కార్యక్రమాన్ని పదేపదే అడ్డుకుంటున్నారని రంగనాదరాజు అన్నారు. అయినా వారి ఆటలు సాగవని, వారు చరిత్ర హీనులు కాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 60వేల ఎకరాల సేకరణ ద్వారా అడుగు ముందుకు వేశామని తెలిపారు. ఇళ్ల స్థలాలు రెడీగా ఉన్నాయని, ఇవ్వటానికి ప్రభుత్వం కూడా సిద్దంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్లారని, కొన్ని వందల రిట్‌ పిటిషన్లు దాఖలు చేయించారని చెప్పారు. (
అందులో ప్రధానంగా నాలుగు రిట్‌ పిటీషన్‌లకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని, వాటి ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసేందుకు, రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీనిని తాము సుప్రీం కోర్టులో సవాల్‌ చేశామని, కోవిడ్‌ సమయంలో సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆ స్టేలను తొలగించే పరిస్థితి లేదన్నారు. కాబట్టి స్థలాల పంపిణీకి కొద్ది సమయం పడుతుందని ఆయన చెప్పారు.పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నాడో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.

tags : ranganadharaju

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info