A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం లో గడ్డర్ల ఏర్పాటు ఆరంభం
Share |
August 13 2020, 11:06 am

పోలవరం ప్రాజెక్టులో వేగం పెంచారు. ఇప్పుడు ప్రాజెక్టుకు భారీ గేట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసేలా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ ను ప్రారంభించారు.నిన్న పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పనులు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మొత్తం గిడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. దీనివల్ల వరదలు వచ్చినా రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. వానాకాలం వచ్చినా.. గోదావరి వరద పొంగినా పనులు ఆగకుండా పనులు చేపట్టారు. పోలవరంకు ఉన్న మొత్తం గేట్లకు (48) సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్ల మీద మొదటి గడ్డర్ ను అమర్చటం మేఘా సంస్ధ నిపుణులు, నీటిపారుదల అధికారులు పర్యవేక్షణలో ప్రారంభమయ్యింది. ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు. అత్యంత క్లిష్ట, కీలకమైన పని ఇది. ఇక ప్రాజెక్టులోని స్పిల్‌ వే లోని 52 బ్లాక్స్‌ కు సంబంధించిన పియర్స్‌ నిర్మాణం పూర్తి కావచ్చింది. స్పిల్‌వే పియర్స్‌ పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనులలో సింహ భాగం పూర్తి అయినట్లే. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి.
స్పిల్‌ వే మొత్తం దూరం 1.2 కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకూ చైనాలోని త్రీ గార్జెస్‌ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా పోలవరంలో స్పిల్ వే నిర్మిస్తున్నారు.

tags : polavaram

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info