A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో 197 మంది జర్నలిస్టులకు కరోనా
Share |
August 13 2020, 11:38 am

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన 197 మంది జర్నలిస్టులకు
ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ
తెలిపారు. వీరిలో పాజిటీవ్ లు వచ్చిన 128 మంది జర్నలిస్టులకు 20 వేల రూపాయల చొప్పున 25
లక్షల 60 వేల రూపాయల ఆర్థిక సహాయం, అదే విధంగా హోంక్వారైంటైన్ లో ఉన్న 69 మంది
జర్నలిస్టులకు 10 వేల రూపాయల చొప్పున 6 లక్షల 90 వేల రూపాయలు ఆర్థిక సహాయం
అందించామని తెలిపారు. మొత్తంగా 32 లక్షల 50 వేల రూపాయలను మీడియా అకాడమి నిధుల
నుండి ఈ సహాయం అందించామని తెలిపారు.
కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అండగా
నిలుస్తుందని ఆయన తెలిపారు. సోమవారంనాటికి వివిధ జిల్లాల నుండి కొత్తగా మరో 29 మంది
జర్నలిస్టులకు పాజిటివ్ వచ్చిందని, వీరితోపాటు మరో 17 మంది జర్నలిస్టులను హోంక్వారంటైన్ లో
ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారని ఆయన తెలిపారు. ఆ 29 మంది జర్నలిస్టులకు
ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున 5 లక్షల 80 వేలు, హోంక్వారైంటైన్ లో ఉన్న17 మంది
జర్నలిస్టులకు 10 వేల చొప్పున ఒక లక్షా 70 వేలు, మొత్తం 7 లక్షల 50 వేల రూపాయలు ఆర్థిక
సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.
జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్
(8096677444) నెంబర్ కి పంపాలని తెలిపారు. మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ
మేనేజర్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కరోనా బారిన పడిన
పాజిటివ్, క్వారంటైన్ జర్నలిస్టులు ప్రభుత్వ డాక్టర్లు దృవికరించిన మెడికల్ రిపోర్టు లు అకాడమీ
కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు.

tags : allam

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info