A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గవర్నర్ తమిళసైకి, సర్కార్ కు బెడిసిందా
Share |
August 13 2020, 11:56 am

తెలంగాణలో గవర్నర్ తమిళపై కి, ప్రభుత్వానికి మద్య అంతరం పెరుగుతోంది. ఆమె ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని వార్తలు సూచిస్తున్నాయి. పలువురు నెటిజన్లు ఆది, సోమవారాల్లో హైదరాబాద్ లో కరోనా సమస్యపై ట్విటర్‌ ద్వారా గవర్నర్‌ తమిళిసై దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో పరిస్థితి దయనీయంగా ఉందని, ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని, ఇక, ఇప్పుడు గవర్నర్ చొరవ చూపాలని కోరారు. ఈ నేపథ్యంలోనే, కరోనా పరిస్థితిపై చర్చించటానికి ఉన్నతాధికారులను పిలిచినట్లు సోమవారం మధ్యాహ్నం ట్విటర్‌ ద్వారా గవర్నర్‌ తెలిపారు.. సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి రావాల్సిందిగా సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రాజ్‌భవన్‌ కబురు పెట్టినట్లు సమాచారం. కానీ, వీరిద్దరూ వెళ్లలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని, తాము రాలేమని రాజ్‌భవన్‌కు స్పష్టం చేశారని అంటున్నారు.సి.ఎమ్.కెసిఆర్ కు తెలియకుండా వారు గవర్నర్ ను దిక్కరిస్తారా అన్న చర్చ జరుగుతోంది.గవర్నర్‌ పిలిచినా వెళ్లకపోవటం ఆ పదవిని అగౌరవపర్చటమేనని కొందరు రిటైర్డ్ అధికారులు భావిస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ మధ్య సత్సంబంధాలు లేవని అనడానికి ఈ పరిణామం అవకాశం కల్పిస్తోందనే వ్యాఖ్యలు ఆ వర్గాల నుంచి వస్తున్నాయి.

tags : tamil aai

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info