A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సగం ఆర్టిసి బస్ లు కూడా తిరగడం లేదు..
Share |
August 13 2020, 11:57 am

లాక్ డౌన్ ఎత్తివేసి , ఆర్టిసి బస్ లను తిప్పుతున్నా, తెలంగాణలో బస్ లు ఎక్కేవారి సంఖ్య బాగా తగ్గడం విశేషం.ఏభై శాతం కూడా సీట్లు నిండడం లేదు.కొన్ని రీజియన్ లలో ఆర్టిసి డీజిల్ ఖర్చులు కూడా సరిగా రావడం లేదట.కరీంనగర్ రీజియన్ లో అదే పరిస్థితి ఉందని ఒక విశ్లేషణ వచ్చింది.
తొలుత ఆర్టిసి సమ్మె, ఆ తర్వాత కరోనా రూపంలో వచ్చిన ఉపద్రవంతో తీరని నష్టాల్ని చూడాల్సి వస్తోంది. మార్చి 22న ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో 58రోజులు డిపోలకే పరిమితమైన బస్సులు మే 19న రోడ్డెక్కాయి. రీజియన్‌లో 892 వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. ప్రస్తుతం అందులో సగంకూడా ప్లాట్‌ఫారంపైకి రావడం లేదు. కరోనాకు ముందు ఇక్కడి బస్సులు 3.67లక్షల కిలోమీటర్లు తిరుగుతూ ప్రతిరోజూ రూ.కోటీ 20లక్షల ఆదాయం సమకూర్చేవి. 5లక్షలా 65వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. వైరస్‌ ప్రభావం మొదలైన ఫిబ్రవరి నుంచి ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. లాక్‌డౌన్‌ విధించేవరకూ రీజియన్‌ పరిధిలో మార్చి నెల రూ.446.94కోట్ల ఆదాయం, రూ.497.21కోట్ల ఖర్చు నమోదైంది. మే 19వరకు బస్సులు డిపోలకే పరిమితంకాగా ఆదాయం రాక సిబ్బంది వేతనాలు, నిర్వహణ భారం సంస్థపై పడ్డాయి. రెండు వారాలుగా వైరస్‌ ప్రభావం తీవ్రం కావడంతో ప్రయాణికుల సంఖ్య సగానికి సగం తగ్గిపోవడంతో తన ఆక్యూపెన్సీని తగ్గించుకుంది. మార్చిలో బస్సులన్నీ నడిచినా రూ.50.27కోట్ల నష్టం వాటిల్లింది. ఏప్రిల్‌, మే 19వరకు బస్సులే రోడ్డెక్కలేదు. తర్వాత బయటకొచ్చినా మార్చి నష్టం సహా జూన్‌ 30వరకు సుమారు రూ.120కోట్ల మేర నష్టం జరిగిందని ఆర్టీసీ అధికారులు అంచనా అని నవతెలంగాణ పత్రిక ఒక కదనాన్ని ఇచ్చింది.

tags : trtc

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info