A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఓట్ల చీలిక పాచిక- ట్రంప్ కు కలిసి వస్తుందా
Share |
August 13 2020, 10:12 am

అమెరికాలో సడన్ గా జరిగిన ఒక పరిణామం ఆ దేశ రాజకీయాలపై ప్రభావం పడవచ్చని విశ్లేసణలు వస్తున్నాయి. ప్రస్తుతం రిపబ్లికన్ అభ్యర్దిగా మరోసారి పోటీచేస్తున్న దేశ అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బిడెన్ కు మద్య తీవ్ర మైన పోటీ ఉంది. బిడెన్ గెలుపు ఖాయమన్నట్లుగా సర్వేలు వస్తున్నాయి.ఈ తరుణంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు, వ్యాపారవేత్త అయిన కనే వెస్ట్ తాను కూడా అద్యక్ష పదవికి పోటీ పడుతున్నట్లు ప్రకటించారు. కొంత ఆలస్యం అయినప్పటికీ తాను రంగంలో ఉంటానని అన్నారు. ఆయన ఆప్రో అమెరికన్ జాతీయుడు కావడంతో ,బిడెన్ ఓట్లకు గండి కొడతారా ? అన్న చర్చ జరుగుతోంది. ఈయన సీరియస్ గా ఎన్నికల ప్రచారం చేసి బ్లాక్స్ ఓట్లను ఆకర్షిస్తే వారి ఓట్లు చీలి ట్రంప్ కు పరిస్థితి మెరుగుపడవచ్చని కొందరి బావన.గత ఎన్నికలలో గ్రీన్ పార్టీకి చెందిన ఒక అభ్యర్ధి పోటీ వల్ల కొన్ని రాష్ట్రాలలో ఓట్లు చీలి ట్రంప్ కు ప్రయోజనం కలిగింది.ఇప్పుడు కూడా అలా జరుగుతుందా అన్నది చూడాలని అంటున్నారు. ఈయన అట్ఆంటాలో పుట్టి, చికాగోలో పెరిగాడు. ఆ ప్రాంతాలలో బ్లాక్స్ ప్రభావం అదికంగా ఉండి. ఈయన ఓట్లు గణనీయంగా చీలుస్తారేమోనన్న అనుమానం ఉంది. కాగా వెస్ట్ 2018 లో ట్రంప్ ను కలిసి బాగా ప్రశంసించారు. దీంతో ట్రంప్ గేమ్ కూడా ఇందులో ఉందా అన్న సంశయం కూడా వస్తుంది.

tags : america

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info