A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చేతి వృత్తులకు వైభవం తెచ్చిన కెసిఆర్
Share |
August 13 2020, 11:43 am

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ కు హరితహారం 6వ విడత కార్యక్రమంలో భాగంగా
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని చేగూరు గ్రామంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో
నిర్వహించిన కార్యక్రమంలో 4 వేల ఈత మొక్కలను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ
మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక శాసన
సభ్యులు శ్రీ అంజయ్య యాదవ్ గారితో కలసి నాటారు.  
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ
ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గత 6 సంవత్సరాలలో చేతి వృత్తులకు పూర్వ వైభవం
తీసుకవచ్చారన్నారు. గొల్ల కురుమలకు, ముదిరాజులకు, పద్మశాలిలకు, గౌడ్ లకు, నాయి బ్రహ్మణులకు,
రజకుల తో పాటు ఇతర వెనుకబడిన తరగతుల కు, SC, ST మరియు మైనారిటీల సంక్షేమం కోసం, నిరంతరం
కృషిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గౌడ్ ల సంక్షేమం కోసం నీరా పాలసీ ని ప్రవేశపెట్టి సాంప్రదాయంగా వస్తున్న
గౌడ్ ల కుల వృత్తిని ప్రోత్సహిస్తున్నారన్నారు. బీసీ ల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాల ను  హైదరాబాద్
నగరంలో సుమారు 4, 5 వేల కోట్ల విలువైన భూములను కేటాయించి నిర్మిస్తున్నారన్నారు. వెనుకబడిన
తరగతుల కోసం వందల సంఖ్యలో గురుకులాలను పెట్టి బీసీ, sc , st మరియు మైనారిటీలకు విద్యను
అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కిందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో భాగంగా
రాష్ట్రంలో 12 వేల 751 గ్రామ పంచాయతీ లలో ఈ సంవత్సరం 4000 వేల గ్రామపంచాయతీల యందు ఒక్కో
గ్రామానికి (1000) వెయ్యి మొక్కల చొప్పున గ్రామపరిధి లోని చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలు
మరియు ప్రభుత్వ భూములలో గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, ఇతర ప్రజా ప్రతినిధులు, మరియు
మండల, జిల్లా అధికారులను  ఎక్సైజ్ శాఖ అధికారులు భాగస్వామ్యం చేసి గ్రామాలను  తాటి, ఈత వనాల గా
మార్చాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి హరితహారంలో ప్రొహిబిషన్
మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 3కోట్ల 75 లక్షల  మొక్కలను నాటామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్
గారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల  ప్రజా పరిషత్ అధ్యక్షులు మంచన్ పల్లి ప్రియాంక శివశంకర్ గౌడ్ మరియు
స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ వై ఖురేషీ, ES రఘురాం,
మరియు సిబ్బంది పాల్గొన్నారు.

tags : srinivas goud

Latest News
*పరిశ్రమలవారితో గవర్నర్ వీడియో కాన్పరెన్స్
*మంత్రి మండలి సమావేశం నిర్వహించిన కెటిఆర్..ఇక..
*రమేష్ ఆస్పత్రి దందాపై ప్రత్యేక కధనం
*కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందించవద్దు- జగన్
*అవుట్ సోర్సింగ్ ను శ్రమ దోపిడీ అన్న హైకోర్టు
*కెటిఆర్ గిఫ్ట్ ఎ స్మైల్ పిలుపుకి భారీగా స్పంద‌న‌
*బజిపి, టిఆర్ఎస్ ల మద్య లాలూచీ స్నేహం
*క్యూలో నిలబడి పత్రికల కొనుగోలు- ప్రీ ప్రెస్
*డిజిపి మహేందర్ రెడ్డికి రాజ్యసభ ఇస్తానన్నారా
*గండికోటలో ల27 టి.ఎమ్ సిల నీరు ఉంచాలి
*విజయనగరం ప్రాజెక్టులు పూర్తి చేయాలి
*కెటిఆర్ కాబోయే సి.ఎమ్..అందుకే రిహార్సల్స్
*తెలంగాణలో కరోనా బులెటిన్
*తెలంగాణలో ఆహార శుద్ది పరిశ్రమల కొత్త వ్యూహం
*బెంగుళూరు నుంచి వస్తే కరోనా పరీక్షలు అక్కర్లేదు
*టిడిపి ఎమ్మెల్యే రెండు కళ్ల సిద్దాంతం
*దేవంలో ఎక్స్ ప్రెస్ హై వేల కోసం ప్లాన్
*ఎపి ప్రభుత్వానిది జలదోపిడీ- కాంగ్రెస్
*దేశం వదలి పారిపోయిన ప్రతిపక్ష నేత
*చంద్రబాబుది ఓర్వలేనితనం
*డిసెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info