A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సి.ఎమ్. జగన్ కు కులం ఆపాదిస్తారా పోసాని ఫైర్
Share |
August 15 2020, 2:00 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కులాన్ని ఆపాదించడాన్ని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళీ తప్పు పట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మొదట నుంచి కులాలకు అతీతంగా సేవ చేసిందని ఆయన అన్నారు.తాను పులివెందుల వెళ్లి పదిహేను రోజులు ఉన్నానని, జగన్, ఆయన భార్య భారతి అక్కడ కులం,మతం వంటివి ఏమీ చూడకుండా స్కూళ్లు పెట్టారని, అలాగే దివ్యాంగులకు హాస్టళ్లు ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎక్కడా కులం గురించి ఆలోచనే లేదని అన్నారు.మరి చంద్రబాబు టైమ్ లో నంది అవార్డుల కమిటీ వేస్తే పదమూడు మంది ఒకే కులం వారు ఎలా పెట్టారని అన్నారు .పచ్చ మీడియాలో కుల తత్వంతో తప్పుడు రాతలు రాస్తోందని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగా ప్రజల గుండెల్లో నిలిబిపోయారో, జగన్ కూడా అంతకన్నా ఎక్కువగా నిలిచిపోతారని అన్నారు. ఎపిని నెంబర్ ఒన్ గా చేస్తారని ఆయన అన్నారు.అందువల్ల ఎవరూ కుత్చితమైన ఎల్లోమీడియాను నమ్మవద్దని,అబద్దాలు చెబతున్న ప్రతిపక్షాన్ని నమ్మవద్దని ఆయన అన్నారు. జగన్ కు కుల ముద్ర వేసి ప్రజలలో వ్యతిరేకత తేవాలన్న వీరి కుట్రలను ప్రజలు నమ్మబోరని పోసాని అన్నారు.

tags : posani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info