A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హైదరాబాద్ లో మరో 44 బస్తీ దవాఖానాలు
Share |
August 15 2020, 2:05 am

ద‌వాఖానాల ఏర్పాటుకు వ‌స‌తులు క‌ల్పించిన
జిహెచ్‌ఎంసి - క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌*
*మొద‌టి ద‌శ‌లో 123, రెండో ద‌శ‌లో 44 బ‌స్తీ ద‌వ‌ఖానాల‌ ఏర్పాటు*
*కొత్త‌గా ప్రారంభించే 33తో న‌గ‌రంలో 200ల‌కు పెర‌గ‌నున్న బ‌స్తీ
ద‌వాఖానాల సంఖ్య‌*
*కాల‌నీవాసులకు మ‌రింత చేరువ‌కానున్న ప్ర‌భుత్వ వైద్యం*
  న‌గ‌రంలో ఉన్న పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ వైద్యాన్ని మ‌రింత చేరువ
చేసేందుకు  కొత్త‌గా 33 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేసేందుకు జిహెచ్‌ఎంసి ద్వారా వ‌స‌తి, ఇత‌ర మౌలిక వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు
జిహెచ్‌ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఆధ్వ‌ర్యంలో వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బందిని
నియ‌మించి కాల‌నీవాసుల‌కు ప్రాథ‌మిక వైద్య సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఆకాంక్ష‌ల
మేర‌కు  పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉండే కాల‌నీలు, బ‌స్తీల‌కు ప్ర‌భుత్వం వైద్యాన్ని చేరువ చేసేందుకు బ‌స్తీ
ద‌వాఖానాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న‌ది. ఇందులో భాగంగా 2019లో ఏర్పాటు చేసిన 123 బ‌స్తీ ద‌వాఖానాల‌కు అద‌నంగా
2020 మే 22న మ‌రో 44 బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు
ఆదేశాల మేర‌కు జిహెచ్‌ఎంసి ప‌రిధిలో ప్ర‌తి వార్డుకు క‌నీసం రెండు చొప్పున బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంలో
భాగంగా మ‌రో 33 బ‌స్తీ ద‌వాఖానాలను ప్రారంభించుట‌కు అనువుగా   వ‌స‌తులు క‌ల్పించిన‌ట్లు క‌మిష‌న‌ర్ తెలిపారు. దీంతో న‌గ‌రంలో
బ‌స్తీ ద‌వాఖానాల సంఖ్య 200 ల‌కు చేరుతుంద‌ని తెలిపారు.

tags : clinics

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info