A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లా నేస్తం- పవన్ కళ్యాణ్ ప్రకటన
Share |
August 15 2020, 2:10 am

లా నేస్తం’ పథకాన్ని నాలుగు నెలలుగా ఎందుకు కొనసాగించడం లేదు?
• న్యాయవాదుల ఆర్థిక కష్టాలపై సర్కార్ సానుభూతితో స్పందించాలి అ
• న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రకటించిన రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలి అంటూ జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇది.

కరోనా మహమ్మారి వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పాలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో
పాలకులు సహృదయంతో స్పందించాలి. ఉన్న పథకాలను కొనసాగిస్తూ సక్రమంగా నిధులు
విడుదల చేయాలి. కరోనా కష్టాలు మొదలైనప్పటి నుంచి ‘లా నేస్తం’ పథకం ఎందుకు
నిలిచిపోయిందో, న్యాయవాదుల సంక్షేమ నిధి ఏమైందో న్యాయవాదులకు అర్థం కాని
పరిస్థితి నెలకొంది. న్యాయవాదులు న్యాయ శాస్త్రం అభ్యసించి ఉన్నతమైన
వృత్తిలో ఉన్నా ఆర్థికంగా కుదురుకొనే పరిస్థితి ఎక్కువమందికి లేదు అనేది వాస్తవం.
ఎక్కువ మందికి చాలీచాలని సంపాదనే వస్తోంది. కరోనా ప్రభావంతో మేజిస్ట్రేట్
కోర్టు నుంచి ఉన్నత న్యాయస్థానం వరకూ విరామం ప్రకటించాయి.
జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు ఇచ్చే ‘లా నేస్తం’ పథకం కొనసాగి ఉంటే
వారికి ఈ కష్టకాలంలో భరోసా లభించేది. గత నాలుగు నెలలుగా ఎందుకు నిర్వహించడం లేదు,
ఆ ఆర్థిక సాయాన్ని ఎందుకు అందించడం లేదో న్యాయవాదులకు ప్రభుత్వం సమాధానం
చెప్పాలి. లా నేస్తం నిధులు నిలిపివేయడం సమంజసం కాదు. న్యాయవాదుల సంక్షేమం
కోసం రూ.100 కోట్లు ఇస్తామన్నారు... జీవో ఇచ్చారు... అయితే రాష్ట్ర ప్రభుత్వం
ఈ రోజు వరకూ నిధులు విడుదల చేయలేదు.
కరోనా విపత్కర స్థితిలో క్లయింట్ల నుంచి ఫీజులు వచ్చే మార్గం కూడా లేకపోవడంతో
న్యాయవాదులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం ఈ రంగంలో
ఉన్నవారు నా దృష్టికి తీసుకువచ్చారు. బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఈ
మేరకు ఒక వినతి పత్రాన్ని పంపించారు. న్యాయవాద వృత్తిలో ఉన్నవారిలో 80శాతం
మంది కొద్దిపాటి సంపాదనతోనే నెట్టుకొస్తున్నారనే విషయాన్ని తెలిపారు.
కరోనాతో ఆ సంపాదన కూడా లేకపోవడంతో ఎందరో న్యాయవాదులు కష్టాలుపడుతున్నారని
ఆవేదన చెందారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం సానుభూతితో
స్పందించాలి. జూనియర్, సీనియర్ అనే భేదభావం లేకుండా అందరికీ ఆరు నెలలపాటు నెలకు
రూ.10 వేలు చొప్పున ఆర్థిక భృతి ఇవ్వాలని న్యాయవాదులు కోరుతున్నారు.
న్యాయవాదులకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు
తీసుకొంటే వారి పరిస్థితి కుదుటపడుతుంది. లా నేస్తం పథకాన్ని కొనసాగించడంతోపాటు,
న్యాయవాదుల సంక్షేమ నిధికి సంబంధించిన నిధులను తక్షణం విడుదల చేయాలి.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info