A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మహిళా ఎస్సై అలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి
Share |
August 15 2020, 2:15 am

ఎవరిపైన అయినా అత్యాచారం జరిగితే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించవలసిన పోలీసులే నేరానికి పాల్పడిన వారిని రక్షించడానికి యత్నిస్తే ఏమి చేయాలి?అందులోను ఒక మహిళా ఎస్సై ఈ నీచానికి పాల్పడడం మరింత శోచనీయం.గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఒక మహిళా ఎస్సై ముప్పై ఐదు లక్షల లంచం కేసులో అరెస్టు అయ్యారు. ఒక ప్రవైటు కంఎపీలో పనిచేసే ఇద్దరు మహిళలు వారి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనాల్ షా తమపై అత్యాచారం చేశారని గత ఏడాది పిర్యాదు చేశారట.ఈ పిర్యాదు విచారణ బాద్యత మహిళా పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా ఉన్న శ్వేతా జడేజాకు అప్పగించారు. ఆమె నిందితుడి నుంచి 35లక్షల లంచం డిమాండ్ చేశారట. వారు 20 లక్షలు ఇచ్చుకున్నారు.మిగిలిన డబ్బుకు ఒత్తిడి తేవడంతో వారు పోలీసులకు ఈ విషయం పిర్యాదు చేశారు.ఈ పిర్యాదు పై విచారణ చేసిన అదికారులు శ్వేతను అరెస్టు చేశారు.

tags : gujarat

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info