A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బెంగుళూరు నుంచి కూడా జనం వెళ్లిపోతున్నారట
Share |
August 15 2020, 12:41 am

కర్నాటక రాజధాని కూడా బెంగుళూరులో కూడా కరోనా ఆందోళన కలిగిస్తోంది .దక్షిణాదిలోని మూడు ప్రముఖ నగరాలైన బెంగుళూరు,చెన్నై, హైదరాబాద్ లలో పరిస్థితి తీవ్రంగా ఉందన్న భావన కలుగుతోంది. మీడియాలో వచ్చిన కదనాల ప్రకారం బెంగుళూరులో పరిస్థితిని అదుపు చేయడానికి వారాంతపు లాక్ డౌన్ ను బెంగుళూరులో అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా ప్రజలలో విశ్వాసం రావడం లేదని ఒక మీడియా పేర్కొంది.దాంతో బెంగుళూరు నుంచి పలువురు గ్రామాలకు తరలివెళుతున్నారు.కొందరైతే ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయన్న బావనతో తమ ఇళ్లు ఖాళీ చేసి మరీ వెళ్లిపోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు సంబందించి కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. చెన్నై లో అయితే పరిస్తితి బాగా సీరియస్ గా ఉందని ఇప్పటికే ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను ప్రకటించింది. ఈ మూడు నగరాలలోనే వేలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.బెంగుళూరులో సుమారు తొమ్మిదివేల కరోనా పాటిటివ్ కేసులు నిర్దారణ కాగా, మరణాలు 129 వరకు ఉన్నాయి.చెన్నైలో అరవైనాలుగువేల కేసులు రాగా, నలభై వేల మంది రికవర్ అయ్యారు. చైన్నైలో 996 మంది మరణించారు. హైదరాబాద్ లో కూడా సుమారు పన్నెండువేల కేసులు ఇంతవరకు రిపోర్టు అయ్యాయి.

tags : bengalore

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info