A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విల్లాలో నివసిస్తూ, పెద్ద కారులో.. చోరీలు
Share |
August 15 2020, 12:48 am

ఘరానా దొంగలు అంటే వీళ్లనే అనాలి. ఏకంగా ఈ దొంగ అతి విలాసవంత మైన విల్లాలో ఉంటాడట.అంతేకాక మంచి విలువైన ఎస్ యు వి వాహనంలో తిరిగి ఇళ్లలో చోరీ చేస్తుంటాడు. ఇది నిజంగా సస్పెన్స్ ద్రిల్లర్ సినిమా మాదిరే ఉంది. బసవరాజ్ ప్రకాశ్ అనే చోరుడు కర్నాటకకు చెందినవాడు.కర్నాటక ,తమిళనాడులలో పలు చోట్ల దొంగతనాలు చేసి హైదరాబాద్ చేరుకున్నాడు. కర్నాటక పోలీసుల కళ్లు కప్పడానికే అతను ఇక్కడకు వచ్చేశాడట.మొదట అమీన్ పూర్ వద్ద ఒక విల్లాలో దిగాడు.ఆ తర్వాత దుండిగల్ వద్ద ఒక ఇండిపెండెంట్ ఇంటికి మారాడు. భార్య,కొడుకు నిద్రపోయాక, ఇతర చోరీలకు బయల్దేరతాడు. ఒక ఎస్ యు వి లో తిరుగుతుంటాడు. తాళం వేసి ఉండే పెద్ద ఇళ్లను ఇతను లక్ష్యంగా పెట్టుకుంటాడు.దానికి అనుగుణంగా అర్దరాత్రి తను అనుకున్న ఇంటికి చేరుకుని కొద్ది దూరంలో వాహనం ఆపుతాడు. వాహనంలోనే ఇళ్ల తాళాలు పగలకొట్టడానికి అవసరమయ్యే టూల్స్ , రాడ్లు వంటివి పెట్టుకుంటారు. చేతులకు గ్లౌస్ లు కూడా వేసుకుని ఎవరికి పట్టుపడకుండా జాగ్రత్త పడుతుంటాడు.మొత్తం మీద పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు.కాని చివరికి సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. సుమారు డెబ్బై లక్షల విలువైన బంగారం, వెండి తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

tags : thefts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info