A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో చిన్న రైతులకు ఉచితంగా బోర్లు
Share |
August 15 2020, 2:04 am

ఎపిలో రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించనున్నారు. ప్రభుత్వం రిగ్గులు కొనడం కాకుండా, కాంట్రాక్టర్లు ద్వారా వీటిని వేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కాంట్రాక్టర్ ను ఎంపిక చేస్తారు.భూగర్భ జలాన్వేషణ బాధ్యతా కాంట్రాక్టరుదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయా కాంట్రాక్టర్లు తవ్వే బోర్లలో కనీసం 80 శాతం విజయవంతమైతేనే పూర్తి బిల్లులు చెల్లిస్తారు. అంటే వందకు 80 బోర్లు విజయవంతమైతే పూర్తిస్థాయిలో బిల్లులిస్తారు. ఒకవేళ 70 విజయవంతమైతే పదింటికి మినహాయించి 90కే బిల్లు చెల్లిస్తారు. బోరు డ్రిల్లింగ్‌ సమయంలో కనీసం గంటకు వేయి గ్యాలన్లు (4500 లీటర్లు) నీళ్లు వస్తేనే ఆ బోర్ సఫలం అయినట్లు పరిగణిస్తారు. ఐదు ఎకరాల లోపు రైతులకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ఆయా సచివాలయాల ద్వారా పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలి. వీటిని వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. కాగా, అర్హులైన రైతుల సెల్‌ఫోన్‌కు అధికారులు సమాచారమిస్తారు.

tags : ap,bores

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info