A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విశాఖకు ఎప్పుడైనా రెడీ- డిజిపి
Share |
August 15 2020, 1:14 am

విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధానిని తరలించడానికి రంగం సిద్దం అవుతోందని అనుకోవాలి. విశాఖలో డిజిపి పర్యటించి ఆయా భవనాలను పరిశీలించిన నేపద్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. విశాఖకు ఎప్పుడు కార్యనిర్వాహక రాజధానిని తరలించినా పోలీసు శాఖ సిద్దంగా ఉందని సవాంగ్ చెప్పారని వార్తలు వచ్చాయి.
ఇక్కడి ఐటీ హిల్స్‌పై భవనాలు ఎంతమేర అనుకూలంగా ఉంటాయో పరిశీలించానని తెలిపారు. గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం కోసం ఇటీవల ఆనందపురం మండలం జగన్నాథపురంలో ప్రభుత్వం 384 ఎకరాల భూమిని కేటాయించిందన్నా రు. అయితే అత్యుత్తమ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వాలంటే ఈ భూమి సరిపోదని, సింహాచలం సమీపంలోని అటవీ భూములను కూడా కేటాయించాలని కోరడానికి గాను, ఆ భూములను స్వయంగా పరిశీలించానని సవాంగ్ వివరించారు. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

tags : sawang

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info