A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముంబైకి తిరిగి వస్తున్న వలస కార్మికులు
Share |
August 15 2020, 12:54 am

కరోనా సంక్షోభం మొదలైన రోజులలో లక్షల సంఖ్యలో వలస కార్మికులు తమ స్వరాష్ట్రాలకు ఎంతో ఆతృతతో వెళ్లిపోయారు. అందుకోసం వారు ఎన్నో పడరాని కష్టాలు పడ్డారు.వందల కిలోమీటర్ల దూరం నడవడానికి కూడా వెనుకాడలేదు.ఎలాగైతే సొంత ఊళ్లకు వెళ్లారు. కాని కొంతకాలం గడిచేసరికి వారిలో పలువురికి మనసు మారుతోంది. తిరిగి ఉపాది అవకాశాలు వెతుక్కోవడం ఆరంభం అయింది.దాంతో తిరిగి తాము గతంలో పనిచేసిన నగరాలకు వెళ్లడం ఆరంభమైందని కదనాలు వస్తున్నాయి.ముంబైకి కొన్ని లక్షల మంది వచ్చేశారని ఒక ఆంగ్ల పత్రిక స్టోరీ ఇచ్చింది. కరోనా వైరస్ కు భయపడి ముంబై నుంచి సుమారు ముప్పై లక్షల వరకు ఆయా రాస్ట్రాలకు వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ ,బీహారు, పంజాబ్ వంటి రాష్ట్రాలకు వెళ్లినవారిలో పలువురు తిరుగు ముఖం పట్టారు. సుమారు మూడు లక్షల మంది వరకు ఇప్పటికే చేరుకున్నారు. ముంబైలో పనులు దొరుకుతాయన్న ఉద్దేశం, ముంబై జీవన శైలికి అలవాటుపడడం వంటి వాటిని కారణాలుగా చెబుతున్నారు. అదే సమయంలో స్వస్థలాలలో ఆశించిన రీతిలో పనులు దొరకకపోవడం కూడా కారణం కావచ్చని అంటున్నారు.

tags : mumbai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info