A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కరోనా తో మాజీ ఎమ్మెల్యే మరణం
Share |
August 15 2020, 2:23 am

ఢిల్లీలో కరోనా కారణంగా ఒక మాజీ ఎమ్మెల్యే చనిపోయారన్న వార్త వచ్చింది. మహేందర్ యాదవ్ అనే ఈ మాజీ ఎమ్మెల్యే 1984నాటి డిల్లీ అల్లర్లలో దోషిగా కోర్టు లో రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.ఆయన వయసు డెబ్బై ఏళ్లు.యాదవ్ ఉంటున్న బ్యారక్ లోనే ఉంటున్న కన్వర్ సింగ్ అనే ఖైదీ గత నెలలో మరణించాడు. అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది.దాంతో అక్కడ యాదవ్ తో సహా ఇతర ఖైదీలకు పరీక్షలు జరగ్గా, 29 మంది వృద్ద ఖైదీలకు కరోనా పాజటివ్ వచ్చింది. జూన్‌ 26న మహేందర్‌ యాదవ్‌ను ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ(డీడీయూ) ఆస్సత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం లోక్‌నాయక్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ద్వారకలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని సమాచారం వచ్చింది.

tags : carona, x mla, died

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info