A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లాల్సి వచ్చింది
Share |
August 15 2020, 1:26 am

కరోనా వైరస్ వ్యాప్తిలో ముఖ్యమంత్రి కెసిఆర్ విఫలం అయ్యారని బువనగిరి కాంగ్రెస్ ఎమ్.పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం దురదీష్టమని ఆయన వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ ప్రభుత్వాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో పది లక్షలకు పైగా కరోనా టెస్టులు చేస్తే, అదే తెలంగాణలో మాత్రం లక్ష టెస్టులు మాత్రమే చేశారని, ఇది కేసీఆర్‌ వైఫల్యం కాదా అని సూటిగా ప్రశ్నించారు. మేధావులు,విద్యావంతులు,ప్రజలు కేసీఆర్‌ వైఖరిని గమనించాలని, ప్రగతి భవన్‌లో కరోనా కేసులు వచ్చాయని కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌కు వెళ్లారని కోమటిరెడ్డి అన్నారు. కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా పేషేంట్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.

tags : komatireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info