A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మనో వికాసానికి గురువే మూలం
Share |
August 15 2020, 2:24 am

మనో వికాసానికి గురువే మూలం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఇది.

;గురుసాక్షాత్ పరబ్రహ్మ అని గురువును పూజించడం ఉత్కృష్టమైన మన భారతీయ
సంప్రదాయం. విజ్ఞాన సముపార్జనకు గురువే మూలం. గురువే జీవిత మార్గదర్శి.
తల్లిదండ్రుల తరువాత అంతటి గొప్పస్థానంలో నిలిచేది గురువే. అటువంటి
గురువులను ప్రత్యేకంగా గౌరవించుకునే గురు పౌర్ణిమ నేడు. భారతీయ
విజ్ఞానాన్ని నాలుగు వేదాలలో నిబిడీకృతం చేసిన ఆది గురువు వేదవ్యాసులు ఆషాడ
శుద్ధ పౌర్ణమి నాడు జన్మించడం భారతీయుల భాగ్యం. ఆయనను స్మరించుకుంటూ
కళ్లెదుట కనిపించే గురువులకు ఫలాలు, పుష్పాలు, కానుకలు సమర్పించి భక్తి
ప్రపత్తులు చాటుకునే మహత్తరమైన రోజు ఈ గురు పౌర్ణిమ. కఠోర సాధనతో
ఆర్జించిన జ్ఞాన సంపదను మానవాళి వికాసానికి, దేశ సౌభాగ్యం కోసం
పంచిపెడుతున్న గురుదేవులందరికీ గురు పౌర్ణమి సందర్భంగా నా తరపున, జనసేన
పార్టీ తరఫున ప్రణామాలు అర్పిస్తున్నాను.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info