A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డిల్లీలో అతి పెద్ద కరోనా ఆస్పత్రి
Share |
August 15 2020, 2:25 am

డిల్లీ ప్రభుత్వం ప్రపంచలోనే అతి పెద్ద కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభించింది. ఇది గతంలో చైనా ఏర్పాటు చేసిన ఆస్పత్రి కన్నా పెద్దదని భావిస్తున్నారు.పదివేల బెడ్స్ ను ఏర్పాటు చేశారు.
ఢిల్లీ లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. దీనికి ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని పేరు పెట్టారు. 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పున్న ఈ కేంద్రం దాదాపు 20 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానమైన స్థలంలో నిర్మితమై ఉంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్(ఐటీబీపీ)‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఈ మేరకు అనిల్‌ బైజాల్‌ ట్విటర్‌ వేదికగా ఆస్పత్రి వివరాలను తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ సా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ ఆస్పత్రిని పరిశీలించారు.

tags : carona, hospital

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info