A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పది లక్షలు దాటిన కరోనా పరీక్షలు-ఎపి
Share |
August 15 2020, 1:29 am

ఎపిలో కరోనా వైద్య పరీక్షల సంఖ్య పది లక్షలు దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా గా తేలినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కూడా కరోనా పాజిటివ్‌గా నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. 391 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 232కు చేరింది. ఈ రోజు మృతి చెందిన వారిలో కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణ, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,043 మంది ఆస్పత్రులలో చికిత్స పొందుతుననారు.

tags : ap, carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info