A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ లో కరోనా- వెలుగు సీరియస్ స్టోరీ
Share |
August 15 2020, 1:30 am

హైదరాబాద్ లోను,తెలంగాణలోని కొన్ని జిల్లాలలో ఉన్న కరోనా సంక్షోభంపై వెలుగు పత్రిక ఇచ్చిన కదనం చాలా సీరియస్ గా ఉంది.ప్రత్యేకించి తెలంగాణలో కరోనా పరీక్షలు బాగా తక్కువగా జరిగిన వైనం ,ప్రైవేటు లాబ్ లలో పాజిటివ్ రేటు అదికంగా వస్తున్న వైనంపై కదనాన్ని ఇచ్చారు.
ఆ కధనంలో ఒక భాగం ఇలా ఉంది. జూన్ 15 నాటికి రాష్ట్రంలో 43,180 టెస్టులు చేస్తే.. 5,193 మందికి పాజిటివ్ వచ్చింది. జూన్ 16 నుంచి టెస్టుల సంఖ్యను పెంచారు. ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులకు అనుమతించారు. ఇక అప్పటి నుంచి అసలు కథ షురువైంది. టెస్టుల సంఖ్య పెరిగింది. కేసుల అసలు లెక్క బయటకొచ్చింది. ఈ 18రోజుల్లో 67,365 టెస్టులు చేస్తే, 17,119 కేసులు వచ్చినయి. టెస్టు చేయించుకున్న ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఇందులోనూ 50 వేలకు పైగా టెస్టులు గ్రేటర్‌ హైదరాబాద్‌‌, చుట్టుపక్కల జిల్లాల్లోనే చేశారు. జిల్లాల్లోనూ టెస్టుల సంఖ్యపెంచితే, అక్కడి అసలు సంగతేంటో తెలిసే అవకాశం ఉంది.కరోనా టెస్టుల విషయంలో సర్కార్ నిరక్ష్ల్యంగా వ్యవహరిస్తే.. ట్రేసింగ్ విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్టులకు కూడా సకాలంలో టెస్ట్ చేయించడం లేదు. టెస్టుల కోసం బాధితులే వెళ్లి ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబుల వద్ద లైన్లు కడుతున్నారు. టోకెన్లు అయిపోయాయని శాంపిల్ సెంటర్ల వద్ద ఉన్న సిబ్బంది, బాధితులను వెనక్కి పంపుతున్నారు. ఇలా తిరిగి తిరిగి శాంపిల్‌‌ ఇస్తే, టెస్ట్ రిజల్ట్ రావడానికి ఇంకో నాలుగైదు రోజులు పడుతోంది. ఈలోపల ఏదైనా జరిగి దవాఖానకు పోతే, రిపోర్ట్‌‌ ఉంటే తప్ప చేర్చుకోబోమని వెనక్కి పంపిస్తున్నారు. అటు, ఇటూతిరిగి దవాఖాన గేట్ వద్దే బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ప్రైవేటు హాస్పిటళ్లలో ఎమ్మెల్యేలు, మంత్రులతో రికమెండ్ చేయించుకున్నా బెడ్లు దొరకని పరిస్థితి ఉందంటూ ప్రభుత్వ పెద్దలే చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖాన్లపై నమ్మకం కలిగించేందుకు కనీసం ఓ కార్యక్రమం కూడా చేపట్టడం లేదు. గాంధీ హాస్పిటల్లోనే కార్పొరేట్‌‌ స్థాయిలో సేవలు అందిస్తున్నామని చెబుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు హాస్పిటల్స్‌‌కు వెళ్తున్నారు.
రాష్ట్రంలో కరోనా టెస్టులు, ట్రీట్‌‌మెంట్‌ ‌కోసం ప్రైవేటులో అనుమతించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రైవేట్‌‌లో టెస్టుల సంఖ్యను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రభుత్వం మొదలుపెట్టింది. పర్మిషన్ ఇచ్చిన పది రోజులకే ప్రైవేటు ల్యాబుల్లో రైడ్‌ చేయించింది. అన్ని ల్యాబుల్లోనూ టెస్టులు కరెక్ట్ చేయడంలేదని ఓసారి.. కొన్ని ల్యాబుల్లోనేనని మరోసారి ప్రకటనలు చేసింది. లెక్కకు మించి టెస్టులు చేస్తున్నారని, పాజిటివ్ రేట్‌‌ ప్రైవేటులో ఎక్కువ వస్తోందని చెప్పుకొచ్చింది. ల్యాబులు సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ టెస్టులు తక్కువ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి. రోజూ 8 వేల టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. 3 వేల కంటే ఎక్కువ టెస్టులు చేయకపోవడానికి ఇదే కారణమని వాళ్లు అంటున్నారు.అని కదనాన్ని ఇచ్చారు.
వెలుగు పత్రిక కదనంలో కొంత అతి ఉంటే ఉండవచ్చు కాని, ప్రభుత్వం దీనిపై మరింత దృష్టి పెట్టవలసిన అవసరం ఉండవచ్చన్న అబిప్రాయం కలుగుతుంది.

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info