A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభుత్వ డాక్టర్ కరోనా వస్తే ప్రైవేటు ఆస్పత్రికి..
Share |
August 15 2020, 1:33 am

ఒక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు కరోనా వైరస్ కు గురైన తర్వాత ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం , ఆ ఆస్పత్రి వరకు భారీ బిల్లు వేయడం వివాదంగా మారింది. సుల్తానా అనే డాక్టర్ హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందట.దాంతో ఆమె ఫీవర్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకోకుండా, చాదర్ ఘాట్ లోని తుంబి ఆస్పత్రిలో చేరారు.అయితే ఒక రోజుకే ఆమెకు 1.15 లక్షల రూపాయల బిల్లు వేశారు.దాంతో ఆమె బిత్తరపోయి ,ఇంత బిల్లేమిటని ప్రశ్నించారు.ఆమె ఆ మొత్తం చెల్లించకపోవడంతో ఆమెను ఆస్పత్రి యాజమాన్యం నిర్భందించారట.ఆ విషయం ఆమె ఒక సెల్పీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలియచేశారు.అది కాస్త వైరల్ అయింది. టీవీలలో కూడా ప్రసారం అయింది.అయితే సుల్తానా తెల్లవారుజామున ఇంటికి వెళ్లిపోయారని ,తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు అంటున్నారట.ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ అయి ఉండి ప్రైవేటు ఆస్పత్రిలో చేరవలసిన అవసరం ఏముందని ,తమకు చెప్పి ఉంటే మెరుగైన వైద్యం చేసేవారమని ఫీవర్ ఆస్పత్రి అదికారులు అంటున్నారు. మరి ఇంతకీ వాస్తవం ఏమిటి?హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్పత్రులకు కరోనా చికిత్స కోసం ప్రభుత్వ డాక్టర్లే వెళ్లకపోవడం కూడా అప్రతిష్టే అవుతుంది కదా!

tags : carona

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info