A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కంటోన్మెంట్ కు నిధులు ఇవ్వండి
Share |
August 11 2020, 12:38 pm

కంటోన్మెంట్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి
ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ
T.హరీష్ రావు అన్నారు. గురువారం మంత్రులు శ్రీ తలసాని
శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీ
మల్లారెడ్డి, కంటోన్మెంట్ బోర్డ్ CEO, బోర్డ్
సభ్యులు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును ఆయన
కార్యాలయంలో కలిసారు. కంటోన్మెంట్ ప్రాంత
అభివృద్ధి, ఆప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక
సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుండి రావలసిన 80
కోట్ల ను విడుదల చేయాలని కోరారు. బుధవారం
కంటోన్మెంట్ బోర్డ్ కార్యాలయంలో మంత్రి శ్రీ
తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగిన
సమావేశంలో అభివృద్ధి పనులకు నిధులు లేవని, ప్రభుత్వమే
నిధులు విడుదల చేసి ఆదుకోవాలని బోర్డు సభ్యులు
మంత్రులను కోరారు. ఈ మేరకు గురువారం ఆర్ధిక శాఖ
మంత్రి ని కలిసి పరిస్థితులను వివరించారు. స్పందించిన
ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ
కంటోన్మెంట్ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ
పరిధిలో ఉంటుందని, కానీ అక్కడి ప్రజల బాగోగులను
కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని కారణంగా దేశంలోని ఏ
కంటోన్మెంట్ లో లేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను
కల్పిస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని
సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ వర్తింప

చేస్తుందని చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజల
అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజల
సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 10 కోట్ల
రూపాయలు చొప్పున విడుదల చేస్తామని మంత్రి హరీష్
రావు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య
కార్యదర్శి రామకృష్ణారావు, కంటోన్మెంట్ బోర్డ్
CEO చంద్రశేఖర్, అభిజిత్ రెడ్డి, సభ్యులు మహేశ్వర్
రెడ్డి, పాండు యాదవ్, సదాకేశవ రెడ్డి, శ్యాం,
ప్రభాకర్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

tags : harisharao

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info