A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ హెలికాఫ్టర్ మనీ బదులు అంత అప్పు
Share |
August 11 2020, 12:56 pm

కరోనా సంక్షోభంలో హెలికాప్టర్ మనీ ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం లక్షన్నర కోట్ల అప్పు చేయడానిక రంగం సిద్దం చేసిందని ఒక పత్రిక కదనాన్ని ఇచ్చింది.
కార్పొరేషన్ల పేరుతో ఈ ఏడాది మరో రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్ట మొచ్చినట్లు అప్పులు చేయకుండా కట్డడి చేసే ఎఫ్ఆర్ బీఎం లిమిట్ ను మన రాష్ట్ర ప్రభుత్వం సవరించుకుందని ఆ పత్రిక తెలిపింది.ఇప్పటివరకు అమల్లో ఉన్న 2005 ఎఫ్ఆర్బీఎం యాక్ట్ 34 కు రెండు సవరణలను చేసింది. ఎఫ్ఆర్ బీఎం పరిధిలో చేసే అప్పులన్నీ బడ్జెట్ పద్దుల్లో పొందుపరచటం తప్పనిసరి. కానీ కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులు బడ్జెట్డ్జె లో కనిపించవు. ప్రభుత్వం వీటిని గ్యారంటీలుగా చూపిస్తుంది. చివరకు..వీటిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంగడిచిన ఆరేండ్లలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పవర్, ఇరిగేషన్ ప్రాజెక్టు లకు వివిధ కార్పొరేషన్లపేరిట రూ. 1.13 లక్షల కోట్లు అప్పులు తెచ్చింది. చట్టప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీలకు కూడా లిమిట్ ఉంది. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో గ్యారంటీల మొత్తం 90 శాతం దాటకూడదని ఎఫ్ఆర్బీఎం చట్టంలోని తొమ్మిదో సెక్షన్ (డీ) క్లాజ్ లో ఉంది. తాజా ఆర్డినెన్స్ లో ప్రభుత్వం ఈ క్లాజ్ ను సవరించింది. 90 శాతం బదులుగా 200శాతం అనే పదాన్ని చేర్చింది. దీంతో కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులు రెవెన్యూ రాబడి కంటే డబుల్ కానుంది. అంటే రూ. 2 లక్షల కోట్లు దాటిపోతుందని, ఆ పత్రిక వ్యాఖ్యానించింది. పెరిగిన లిమిట్ తో రూ. 55 వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకుంది. వీటికి తోడు కార్పొరేషన్ల పేరిట తెచ్చే అప్పులతో ఈ ఏడాది చివరకు తెలంగాణ అప్పు రూ. 4 లక్షల కోట్లు దాటిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నదని ఆ కదనం వివరించింది.

tags : telangana, debt

Latest News
*ఎపిలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది- రామ్ మాధవ్
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ఉమ్మడి రాజధాని ని వదిలేశారే- రామ్ మాధవ్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info