A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అచ్చెన్నాయుడుకు బెయిల్ నిరాకరణ
Share |
August 15 2020, 2:28 am

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇవ్వడానికి ఎసిబి కోర్టు నిరాకరించింది.ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. ఆయన పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈఎస్‌ఐ కుంభకోణం కేసులో ఏ-2గా ఉన్న అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. అచ్చెన్న బెయిల్ పిటిషన్ ను ఎసిబి వ్యతిరేకించింది.విచారణలో అచ్చెన్నాయుడు సహకరించలేదని , మళ్లీ విచారించవలసి ఉందని ఎసిబి కోర్టుకు తెలిపింది.ఇది లా ఉండగా, ఈఎస్‌ఐలో జరిగిన రూ.150 కోట్లకు పైగా స్కామ్‌తో ప్రమేయం ఉన్న ఇంకా దొరకనివారిని కూడా అరెస్టు చేయడానికి ఎసిబి ప్రత్యేక బృందాలను రంగంలో దించింది. మొత్తం 18 మంది నిందితులకు గాను తొమ్మిది మంది దొరకవలసి ఉంది.

tags : acchennaidu, bail

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info