A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజుపై అనర్హత - స్పీకర్ ను కోరిన వైసిపి
Share |
August 15 2020, 1:32 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాకు పిటిషన్ ఇచ్చామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన తోపాటు పలువురు ఎమ్.పిలు కలిసి ఈ పిటిషన్ సమర్పించారు. తాము రూల్ ను కోట్ చేసి ఈ పిర్యాదు చేశామని అన్నారు. ప్రజాస్వామ్య మూల సూత్రాలకు వ్యతిరేకంగా రఘురామరాజు ప్రవర్తించారని ,ఆయన చర్యలు,ఆయన మాట్లాడిన తీరు, మాటలు ,పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, ఏ పార్టీ టిక్కెట్ పై ఎన్నికయ్యారో, ఏ మానిపెస్టో ప్రకారం ఎన్నికయ్యారో,దానికి అనుగుణంగా నడుచుకోలేదు. పార్టీ అధ్యక్షుడి పట్ల అసభ్యకరంగా మాట్లాడారని, స్వపక్షంలో విపక్షంలా వ్యవహరించిన తీరు. ప్రతిపక్షాల వారితో మంతనాలు జరపడం, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేపధ్యంలో ఈ అనర్హత పిటిషన్ వేశామని ఆయన అన్నారు. ఈ అనర్హత కు సంబందించి సుప్రింకోర్టు, హైకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. రఘురామ కృష్ణం రాజు ఒక ఆక్వర్డ్ పరిస్తితిని తెచ్చారని, నైతిక విలువలు వదలుకుని, క్రమశిక్షణ ను వదలుకుని, పార్టీలోని వారిని దూషిస్తూ,ప్రతిపక్షాలతో లాలూచీ పడ్డారని విజయసాయి తెలిపారు. అన్ని విషయాలు పరిశీలించి చర్య తీసుకుంటానని స్పీకర్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

tags : vijayasaireddy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info