A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘురాజు హైకోర్టుకు వెళితే ఉపయోగమేనా!
Share |
August 11 2020, 11:38 am

నరసాపురం వైసిపి ఎమ్.పి రఘురామకృష్ణంరాజు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయనివ్వకుండా చూడాలని,తనపై అనర్హత వేటు వేయకుండా చూడాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లారని ఒక వార్త వచ్చింది.ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కాని , ఇది ఆశ్చర్యంగానే ఉంది. కేంద్రంలో రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ ను, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని , స్పీకర్ బిర్లాను,చివరికి ఎన్నికల సంఘాన్ని కలిసి రకరకాల ఫిర్యాదులు చేసి వచ్చారని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది.అసలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపునే రద్దు చేసే అవకాశం ఉందంటూ ,రాజుగారి తెలివితేటలు అంటూ ఒక వర్గం మీడియా విశేషంగా కదనాలు కూడా ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లారో అర్దం కాదు.
తను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని ,
తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని
యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైనందున ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదని ఆయన అంటున్నారు.ఈ కేసు సోమవారం విచారణకు రావచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పార్టీ అంతర్గత వ్యవహారాలలో కూడా హైకోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తుందా?లేదా అన్నది ఆసక్తికరంగానే ఉంటుంది. అసలు తనపై అనర్హతకు అవకాశమే లేదని చెప్పిన రాజు ఇప్పుడు హైకోర్టుకు ఎందుకు వెళ్లవలసి వచ్చిందో అర్దం కాదు.స్పీకర్ ఓం బిర్లా ఏమి చేస్తారో కాని, రాజు చేస్తున్న రకరకాల ప్రయత్నాలు మాత్రం ఆయన ఎంతగా భయపడుతున్నారో చెబుతున్నాయని అనుకోవాలి.

tags : raghuraju

Latest News
*ఏది వృదా వ్యయం..ఏది కాదు..హైకోర్టు తేల్చితే మంచిదే
*చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది
*హైదరాబాద్ లో అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
*రాత్రింబవళ్లు మేనేజ్ చేసి కడపకు నీరిచ్చా-బాబు
*గ్రామ సచివాలయ ఖాళీల భర్తీకి పరీక్షలు
*పాత సచివాలయం లో గుడి కూల్చివేతపై హైకోర్టుకు
*ఎపికి ఐటి పాలసీ విడిగా ఇస్తాం-మేకపాటి
*ఈ ఆరేళ్లలో ఏమి చేశారు కెసిఆర్ గారూ
*'సి.ఎమ్. ఆదేశాలను తు.చ తప్పక పాటించాలి
*తెలంగాణను నీతిఆయోగ్ సబ్యు డు మెచ్చుకున్నారు
*రైతు భీమాకు నిదులు-కెసిఆర్ కు దాంక్స్
*ప్రణబ్ కు కాస్త సీరియస్
*తెలంగాణ కరోనా రిపోర్టు
*చరిత్ర చెబుతున్న కెసిఆర్
*టి.లో 442 మంది జర్నలిస్టులకు కరోనా సాయం
*గ్రామ సచివాలయాలకు పిఎమ్ యు కాల్ సెంటర్
*చంద్రబాబులా అబద్దాలు చెప్పం- రోజా
*ఈశ్వరయ్యపై ఎల్లో మీడియా విష ప్రచారం
*రఘురాజుది రామ భక్తా,బిజెపి భక్తా
*డ్రైవింగ్ సిమ్యులేటర్ ను ప్రారంబించిన మంత్రి
*కరోనా మృతుని అంత్యక్రియల్లో మంత్రి- గుడ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info