A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణలో కూడా కరోనా ర్యాపిడ్ టెస్టులు
Share |
August 15 2020, 12:44 am

తెలంగాణలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి నిరోదానికి గాను ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌ టెస్ట్‌ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ టెస్టు ల వల్ల అరగంటలో ఫలితం తెలుస్తుంది. ఇందుకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి లభించింది. రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. అనంతరం వాటిని ఉపయోగించి వైద్య సిబ్బంది విరివిగా పరీక్షలు చేయనున్నారు. వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తారు. అప్పటికప్పుడే ఫలితం ప్రకటిస్తారు.పాజిటివ్‌ వచ్చిన వారిని తక్షణమే హోం ఐసోలేషన్‌ లేదా అవసరాన్ని బట్టి ఆసుపత్రికి తరలిస్తారు. ముందుగా 50 వేల కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రైవేటు లేబొరేటరీలకు కూడా యాంటీజెన్‌ టెస్టులకు అనుమతి ఇస్తారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని కదనాలు వచ్చాయి. ప్రత్యేకించి హైదరాబాద్ లో వీటిని నిర్వహించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షకు ప్రైవేటు లేబొరేటరీల్లో రూ. 2,200 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ పరిధిలోనూ అదే స్థాయిలో ఖర్చు అవుతుంది. కానీ యాంటీజెన్‌ పరీక్షకు మాత్రం రూ. 500 మాత్రమే ఖర్చు కానుంది. ముందుగా జీహెచ్‌ఎంసీ సహా వివిధ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో యాంటీజెన్‌ పరీక్షలు చేస్తారు.

tags : carona,tests

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info