A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నితిన్ గడ్కరి లెక్కలు చూస్తే .ఇప్పట్లో కోలుకోలేమా
Share |
August 15 2020, 1:39 am

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి చేసిన ప్రకటన ఆసక్తికరంగా ఉంది. ఆయన చెప్పిన లెక్కలు చూస్తే కరోనా దెబ్బ భారత్ పై మామూలుగా లేదనుకోవాలి. దేశ ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవం పొందాలంటే ఏభై లక్షల కోట్ల నుంచి అరవై లక్షల కోట్లు కావాలని ఆయన చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ మేరకు అవసరమని ఆయన అంటున్నారు. హైవేలు, విమానాశ్రయాలు, జలమార్గాలు, రైల్వేలు, లాజిస్టిక్‌ పార్క్‌లు, మెట్రో, ఎంఎస్‌ఎంఈ రంగాలు పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలవు. ఎంఎస్‌ఎంఈ, బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో ఎఫ్‌డీఐ అవసరం ఉంది.హైవేలలో విదేశీ పెట్టుబడులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దుబాయి, అమెరికా ఇన్వెస్టర్లతో సంప్రదింపులు కూడా నడుస్తున్నాయి అని ఆయన అన్నారు. ఈ లెక్కలు చూస్తే ఇప్పట్లో భారత్ కోలుకుంటుందా?

tags : nitin gadkari

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info