A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాష్ట్రం -రెడ్లు- సిపిఐ రామకృష్ణ కుల వ్యాఖ్య
Share |
August 15 2020, 12:50 am

తనను రామకృష్ణ చౌదరి అంటూ కొందరు వైసిపి అబిమానులు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కమ్మ వాళ్లు అయినంతమాత్రాన మాట్లాడకూడదా అని ఆయన అన్నారు. అయితే రాయలసీమకు చెందిన బిసి నేత . కాని కొందరు తెలియక రామకృష్ణ చౌదరి అని పెడుతున్నారు. టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న భావనతో రామకృష్ణకు చౌదరి అని జత చేశారనుకోవాలి. అయితే దీనిపై రామకృష్ణ స్పందించారు.కులం పేరిట బ్లాక్ మెయిల్ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తాన్ని రెడ్లకు... అదీ బంధువులకు అప్పగించి, సిగ్గులేకుండా ఫూలే, అంబేడ్కర్‌ నామ స్మరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘‘రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను... ముగ్గురు రెడ్లకు అప్పగించారు. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి... వీరికే 13 జిల్లాలను పంచారు.పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయం సజ్జల రామకృష్ణారెడ్డికి, అనుబంధ విభాగాలు విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఓవరాల్‌ ఇన్‌చార్జి జగన్మోహన్‌రెడ్డి. పార్టీకీ, అనుబంధ సంఘాలకూ అంతా వీరే. వైసీపీలో రెడ్లు.. అది కూడా ముఖ్యమంత్రి బంధువులు తప్ప వేరే కులాలకు చెందిన వారిలో సమర్థులు లేరా?’’అని ఆయన అన్నారు.


కులం పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తారా అన్న రామకృష్ణ కూడా కులపరంగానే మాట్లాడడం విశేషం.

tags : ramakrishan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info