A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి హైకోర్టుపై కరోనా ప్రభావం
Share |
August 15 2020, 2:09 am

ఎపి హైకోర్టులో పలువురికి కరోనా సోకిన నేపద్యంలో అత్యవసర కేసులను మాత్రమే విచారించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించారు.వాటిని కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ ప‌ద్ధ‌తిలో విచార‌ణ జ‌రుపుతారు. న్యాయమూర్తులు తమ అధికారిక నివాసాల నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్‌ విధానంలో కేసుల విచారణ‌ చేస్తారు. న్యాయస్థానం ముందు దాఖలయ్యే వివిధ పిటిష‌న్లు సైతం ఈ-ఫైలింగ్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే న‌మోదు చేయాల‌ని హైకోర్టు రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెయిల్‌లో అటాచ్‌మెంట్లు స్వీక‌రించ‌బోమ‌ని తెలిపారు. ఏపీ హైకోర్టులో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

tags : ap,high court

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info