A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిక్ టాక్ నిషేధం,నోట్ల రద్దు ఒకటే అన్న ఎమ్.పి
Share |
August 15 2020, 2:26 am

దేశంలో టిక్ టాక్ నిషేధం, నోట్ల రద్దు వంటిదేనని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్.పి సుస్రత్ జహాన్ వ్యాఖ్యానించారు. ఆమె బుధవారం కోల్‌కతాలోని ఇస్కాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టిక్‌టాక్‌ ఒక వినోదకరమైన యాప్‌ అని ,. కేంద్ర ప్రభుత్వం టాక్‌టాన్‌పై విధించిన నిషేధం ఒక హఠాత్తు పరిణామం అని ఆమె అన్నారు.
మూకుమ్మడిగా చైనా కంపెనీలకు చెందిన యాప్స్‌ను నిషేధించడం వల్ల దేశంలోని యువత నిరుద్యోగులుగా మారితే పరిస్థితి ఎంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో విధించిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు ఎంతో నష్టపో​యారని విమర్శించారు. ఇప్పడు టిక్‌టాక్‌ను నిషేధించటం వల్ల కూడా అంతే స్థాయిలో ప్రజలు నష్టపోతారని నుస్రత్‌ జహాన్‌ అభిప్రాయపడ్డారు.

tags : tiktok,demonitisation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info