A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రివర్గ విస్తరణకు రెడీ
Share |
August 15 2020, 12:39 am

మధ్య ప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.ప్రత్యేకించి కాంగ్రెస్ నుంచి చేరిన జ్యోతిరాదిత్య సిందియా వర్గాన్ని సంతృప్తి పరచడానికి కూడా ఈ విస్తరణ అవసరం అయిందని చెబుతున్నారు.వీరిలో కేబినెట్‌ బెర్త్‌ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌కు చెందిన 22 మంది శాసనసభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మార్చి నెలలో కాంగ్రెస్‌ సర్కార్‌ పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం​ ఊహించని పరిణామాలతో అదే నెల 23న తిరుగుబాటు సభ్యుల మద్దతులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ బాధ్యతలు స్వీకరించారు. కాగా కరోనా క్లిష్ట కాలంలోనూ మంత్రివర్గ విస్తరణ అవసరమా అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శలకు దిగుతోంది.

tags : mp,cabinet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info