A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో గుర్రాలపై పోలీసుల లాక్ డౌన్
Share |
August 15 2020, 12:46 am

ఎపిలో కొన్ని చోట్ల లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అనంతపురం, కృష్ణా,గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఆయా చోట్ల లాక్ డౌన్ ను అదికారులు విధించారు. సోషల్ డిస్టెన్స్.. వ్యక్తిగత శుభ్రత.. శానిటైజేషన్ విషయంలో అందరిలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కొనసాగించడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం పోలీసులు వెరైటీగా అందర్నీ ఆలోచింపచేసేందుకు , టుటౌన్ సీఐ జాకీర్ హుసే న్ ఆధ్వర్యంలో వారి సిబ్బంది గుర్రాలపై తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. కరోనా నివారణ బ్యానర్లతో గుర్రాలను అలంకరించి .. జనం గుమిగూడే ప్రదేశాల్లో హెచ్చరికలు చేస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించి వారిలో సామాజిక స్ఫూర్తి ని కలిగించేందుకే ఈ ప్రయత్నమని వారు తెలిపారు.

tags : ap,police,horses

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info