A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అంబులెన్స్ లతో షో చేశారన్న చంద్రబాబు
Share |
August 15 2020, 1:12 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన అంబులెన్స్ ల వ్యవహారంపై ఆయా వర్గాల నుంచి , ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తుంటే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేశారు. అంబులెన్స్ లతో షో చేశారని చంద్రబాబు ఆరోపించారు. తాము కూడా పెద్ద ఎత్తున అంబులెన్స్ లు కొనుగోలు చేశామని ఆయన అన్నారు.పబ్లిసిటీ ద్వారా అన్నిటిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డి పుట్టిన రోజున కానుకగా ఆయన అల్లుడికి వీటి నిర్వహణ కాంట్రాక్ట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. వీటి కొనుగోలులో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కరోనా పై కూడా ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదని అన్నారు. నిర్మలా సీతారామన్ ఎనిమిది వేల కోట్లు ఎపికి ఇచ్చామని అంటున్నారని, ఆ డబ్బును ప్రభుత్వం సక్రమంగా వాడలేదని, ప్రతి కుటుంబానికి ఐదువేల రూపాయల చొప్పున ఇవ్వాలని సూచించినా అమలు చేయలేదని ఆయన విమర్శించారుకరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం లేదని ఆయన అన్నారు.

tags : chandrababu, show,ambulances

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info