A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రఘు రాజు పై అనర్హత వేటుకు వైసిపి పిటిషన్ ?
Share |
August 15 2020, 1:15 am

నరసాపురం ఎమ్.పి రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించడానికి ప్రయత్నాలు మొదలు అయ్యాయని మీడియాలో వార్తలు వచ్చాయి. వైసిపి ఎమ్.పిలు , లాయర్లు కలిసి శుక్రవారం నాడు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి డిల్లీ వెళ్లనున్నారని ఒక మీడియా కదనాన్ని ఇచ్చింది. వారికి స్పీకర్ ఓం బిర్లా అప్పాయింట్ మెంట్ ఇచ్చారని కూడా ఆ కదనం తెలిపింది. వారు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇవ్వనున్నారని ఆ కధనం తెలిపింది.గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న శరద్ యాదవ్ ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అనర్హుడిగా ప్రకటించిన ఉదాహరణను తీసుకుని వీరు స్పీకర్ కు పిటిషన్ ఇవ్వవచ్చని అంటున్నారు. ఈ కదనం నిజమే అయితే ఇది ఉత్కంఠ కలిగించే అంశమే అవుతుంది.

tags : raghuraju

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info