A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అరబిందో ఫౌండేషన్ పై ఆసక్తికర కధనం
Share |
August 15 2020, 2:09 am

వ్యతిరేకతా ? ద్వేషమా ? అంటూ వచ్చిన ఈ వ్యాసం ఆసక్తికరంగా ఉంది..ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అరబిందో ఫౌండేషన్ మీద 104 , 108 ల విషయములో
టీడీపీ చేసే ఆరోపణ ఏమిటంటే ప్రస్తుతం ఒక్కో వాహనానికి నెలకు 45000 రూపాయలనుండి 90000 రూపాయలు అధికంగా ఇస్తున్నారని అది విజయసాయి అల్లుడిది కాబట్టే ఇలా ఇచ్చారని, ఇది ౩౦౦ కోట్ల రూపాయల కుంభకోణమని దాడి చేస్తున్నారే కానీ , తమ ప్రభుత్వములో ఎలా భ్రష్టు పట్టిందీ, అప్పటి జీతాలకు, ఇప్పటి జీతాలకు వ్యత్యాసాన్ని గురుంచి మాట్లాడకుండా విజయసాయి - అతని అల్లుని అరబిందో అనే కోణములో ఒకటే బురద చల్లటం. ఈరోజు ఒక పండుగలాంటి వాతావరణం నెలకొంటే దానిపై విషయాన్ని కక్కడం, పెడబొబ్బలు పెట్టడం చూసి టీడీపీ ధోరణి తెలిసిన ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. అసలు అరబిందో ఫౌండేషన్ ఎవరిది అది ఏమిచేస్తుంటుందని చూస్తే ....
అరబిందో ఫార్మా అనే కంపెనీ సంవత్సరానికి 23000 కోట్ల ఆదాయాన్ని, 2400 కోట్లకు పైగా లాభాన్ని సాధిస్తోంది. మనకు CSR ( కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) తెలుసు కదా దాని నియమాల ప్రకారం కంపెనీ యొక్క గత మూడు ఏళ్లలోని సగటు లాభముపై 2% CSR కింద ప్రజలకు దాతృత్వముపై ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెట్టడానికి ఆయా కంపెనీలు లాభాపేక్ష లేని ఫౌండేషన్ లను కొల్పి ప్రజలకొరకు, సమాజం కొరకు తమకు ప్రాముఖ్యం అనిపించిన విధంగా ఖర్చు పెడుతుంటారు. అరబిందో ఫార్మా అలా స్థాపించినదే అరబిందో ఫార్మా ఫౌండేషన్. వాళ్ళు ప్రతీ ఏటా దాదాపు 40 - 5౦ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఈ ఫౌండేషన్లో మిగిలే డబ్బు ఏమైనా ఉంటె త్రిగి దానిని సమాజం/ ప్రజలకొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది కానీ లాభాలుగా ఎవ్వరూ పొందటానికి లేదు. కింద చూపిన ఆర్థిక గణాంకాలను చూస్తే అరబిందో ఆర్థిక శక్తి గురుంచి వాళ్ళు CSR కింద ఖర్చు పెడుతున్న డబ్బు గురుంచి తెలుస్తుంది. అరబిందో రియాల్టీ అని ఈమధ్యే స్థాపించిన ఇంకొక కంపెనీ హైటెక్ సిటీ లోని IKEA కు ఎదురుగా త్వరలో రాబోయే వాళ్ళ ఒక్క కమర్షియల్ బిల్డింగ్ గెలాక్సీ నుంచే సంవత్సరానికి 150 కోట్ల ఆదాయం అద్దె రూపములో వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫౌండేషన్ వాళ్ళు విశాఖలో LV ప్రసాద్ కంటి ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు, నెల్లూరు , నర్సాపూర్ ఇంకా ఇతర చోట్లా ఆసుపత్రుల నిర్మాణానికి, ఈ మధ్యే శ్రీకాకులములో 5 కోట్ల రూపాయలు వెచ్చించి శ్రీకాకులములో అక్షయ పాత్ర ఔండషన్ కొరకు కేంద్రీయ వంటశాలను, పరికరాలను సమకూర్చారు. ఎన్నో RO ప్లాంట్లను, స్కూల్స్లో టాయిలెట్లను నిర్మించారు. ఇలాంటి అరబిందో ఫౌండేషన్ ఏటా 50 కోట్లకు కక్కుర్తి పడి తమ ప్రతిష్టను చెడగొట్టుకుంటుందా ..? పోనీ టీడీపీ చెప్పేదే నిజమనుకున్నాం అది ఎప్పుడు చెప్పవలసింది 3-6 నెలలు దాటిన తరువాత లాభాలు స్వీకరించి ఆడబ్బును తమ యజమానులు మళ్లించుకుంటే వాటికి ఆధారాలుంటే టీడీపీ వారు వాటిని బయట పెట్టి గట్టిగా నిలదీయవచ్చు, ప్రభుత్వాన్ని బోనులో పెట్టవచ్చు. అలాంటిదేమి లేకుండా వైసీపీకి మంచి పేరొచ్చేటట్లుంది ఇంత విషాన్ని కక్కుదాం అనే దివాలాకోరు తనమే ప్రస్తుతానికి కనిపిస్తోంది. అదిగో తోక అంటే ఇదిగో పులి అని వారికి తోడు ఇతర తోడేళ్ళు.
రాజకీయ పార్టీల అభిమానులు/కార్యకర్తలు గాకుండా తటస్థ ప్రజలదే పార్టీల గెలుపోటములతో ప్రధాన పాత్ర. ఈ తటస్థులు ఖచ్చితంగా ఎవరు చెబుతున్నారన్నది గ్రహించగలుతారు, వారికి ఆ మాత్రం విజ్ఞత లేకపోతే అంత డబ్బు, ప్రచార సాధనాలు, అనుభవముండీ టీడీపీ ఓడిపోయేది కాదు. మరి టీడీపీకి ఇది తెలియకపోదు, కాకపోతే తమ అంతులేని నైరాశ్యం, జగన పై ద్వేషం వారిని విచక్షణ కోల్పోయేలా దహించి వేస్తున్నట్లుంది.

tags : arabindo

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info