A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ పై సంచలన ఆరోపణ
Share |
August 15 2020, 1:19 am

ఎపి హైకోర్టు రిజిస్ట్రార్ రాజశఖర్ ఛీఫ్ జస్టిస్ చర్యలు, నిర్ణయాలు , పెట్టిన ఒత్తిడి వల్లే మరణించారంటూ సంచలన ఆరోపణ మీడియాలో వచ్చింది. ఆల్ ఇండియా బిసి ఫెడరేషన్ వర్కింగ్ అద్యక్షుడు హన్స్ రాజ్ ఈ విషయమై రాస్ట్రపతి రామ్ నాద్ కోవింద్ కు, సుప్రింకోర్టు ప్రదాన న్యాయమూర్తికి, ఇతర సుప్రింకోర్టు న్యాయమూర్తులకు, కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రాలు పంపించారు.కరోనా విషయంలో సిజె జితేంద్ర కుమార్ మహేశ్వరి నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన ఆ పిర్యాదులో ఆరోపించారు. జస్టిస్‌ మహేశ్వరి నిర్లక్ష్య చర్యలు, నిర్ణయాల వల్ల ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ బి.రాజశేఖర్‌ మరణం సంభవించిందని, కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని, అంతిమంగా వారం పాటు కోర్టు మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందని హన్స్‌రాజ్‌ తెలిపారు..

మే 8న హైకోర్టులో మూసిఉన్న చిన్న ఎయిర్‌ కండీషన్డ్‌ హాలులో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. హాలంతా న్యాయమూర్తులు, క్లర్కులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, వీఐపీలతో కిక్కిరిసింది. మాస్క్‌లు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా ఈ కార్యక్రమం జరిగిందని హన్స్ రాజ్ ఆరోపించారు.ఇటీవల చనిపోయిన బి.రాజశేఖర్‌ చనిపోవడానికి కొద్దిరోజుల ముందు అనారోగ్యం పాలైనా బదిలీల పేరుతో కోర్టుకు పిలిపించారని, ఆయన గుండె జబ్బు బాధితుడని హన్స్ రాజ్ వివరించారు. జస్టిస్‌ జేకే మహేశ్వరి తనపై చెప్పలేనంత భయంకరమైన ఒత్తిడిని మోపుతున్నారంటూ రాజశేఖర్‌ తన సన్నిహితులకు, కుటుంబానికి చెబుతూ వచ్చారని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్‌ 24.6.2020 మధ్యాహ్నం 12 గంటల సమయంలో హైకోర్టులో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. రాజశేఖర్‌ను రోజూ కలుస్తూ వచ్చిన సీజే ఈ రోజుకీ కోవిడ్‌ పరీక్ష చేయించుకోలేదని హన్స్ రాజ్ తెలిపారు.సిజె కు రెండున్నర కోట్ల ఖర్చుతో బంగళాను సిద్దం చేసినా,ఆయన అందులోకి మారినా, గెస్ట్ హౌస్ లోని మూడు సూట్ లను వదలిపెట్టడం లేదని కూడా హన్స్ రాజ్ ఆరోపించడం విశేషం. ఈ వార్త మీడియాలో ఒక రకంగా సంచలనమే.దీనిపై చీఫ్ జస్టిస్ మహేశ్వరి ఎలా స్పందించేది చూడాల్సి ఉంటుంది.

tags : ap,highcourt, cj, allegation

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info