A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తప్పు మాదికాదు..బ్రోకర్లది- జెసి వాదన
Share |
August 15 2020, 2:08 am

వాహనాల అక్రమ అమ్మకాల కేసు నుంచి బయటపడడానికి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తంటాలు పడుతున్నారు. ఈ కేసుతో తమకు సంబందం లేదని, బ్రోకర్ ల ద్వారానే తాము వాహనాలను కొనుగోలు చేశామని వారు చెబుతున్నారని కధనం.పోలీసుల విచారణలో కూడా అదే వాదన వినిపించారట. తాము నమ్మిన బ్రోకర్లే ఈ వ్యవహారం నడిపారని వారు అన్నారు. నాగాలాండ్‌ కేంద్రంగా బీఎస్‌–3 వాహనాలను తప్పుడు సరి్టఫికెట్లతో బీఎస్‌–4గా మార్చడంతో పాటు ఏకంగా పోలీసు అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. మరో వైపు ఈ తప్పంతా తాము జేసీ ఆదేశాలతోనే చేసినట్లు ఇతర నిందితులు పేర్కొన్నారని మీడియాలో కధనం. దీంతో ఈ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి తప్పించుకునే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఏ–1గా జేసీ ఉమారెడ్డి (జేసీ ప్రభాకర్‌ రెడ్డి సతీమణి), ఏ–2గా జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఏ–3గా నాగేంద్ర, ఏ–4గా బాబయ్య, ఏ–5గా జేసీ విజయ (జేసీ దివాకర్‌రెడ్డి సతీమణి), ఏ–6గా జేసీ అస్మిత్‌ రెడ్డి (జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయుడు)పై అనంతపురం, తాడిపత్రి స్టేషన్లల్లో మొత్తం 27 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

tags : jc, vehicles

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info